schedule Monday, July 06, 2026

కాంగ్రెస్‌లో హాట్ సీన్..!

calendar_today October 22, 2023
person dharshininews
కాంగ్రెస్‌లో హాట్ సీన్..!
కాంగ్రెస్‌లో హాట్ సీన్..! - కలిసిన రెండు చేతులు - ఎం. రమేష్ తో మనోహర్ రెడ్డి భేటీ - చర్చనీయాంశమైన హస్త రాజకీయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ పార్టీలో హాట్ సీన్ జరిగింది. పార్టీ టిక్కెట్ విషయంలో వ్యతిరేకతగా ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, డీసీసీబీ. చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డిలు చేతులు కలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ రాజకీయ పరిణామం చర్చనీయాంశంగా మారింది. డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ ను డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తాండూరు కాంగ్రెస్ పార్టీ విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో అభ్యర్థి పోటీ విషయాలతో పాటు గెలుపు కోసం తీసుకునే నిర్ణయాలపై మాట్లాడుకున్నారు. పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నట్లు తెలిసింది. అయితే ఎం. రమేష్ మహరాజ్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే వారి గెలుపుకోసం కృషి చేస్తానని పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అంతకుముందు డీసీసీబీ మనోహర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహరాజ్ ఆరోగ్య ఆరా తీసి పరామర్శించారు. మొత్తానికి రమేష్‌ మహరాజ్, మనోహర్ రెడ్డిలు కలవడంతో హస్తం రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఎం. సురేష్ కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21217/