schedule Monday, July 06, 2026

రొంపల్లి మంచి మనసు..!

calendar_today October 23, 2023
person dharshininews
రొంపల్లి మంచి మనసు..!
రొంపల్లి మంచి మనసు..! - ఆర్యవైశ్య పేదలకు చేయూత - పండగకు కిట్లను అందించిన రొంపల్లి సంతోష్ కుమార్ - తండ్రి స్మారకార్థం త్వరలో కొత్త ఫౌండేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : నిత్యం సేవా కార్యక్రమాల్లో ముందుండే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యూత్ సెక్రటరీ, తాండూరుకు చెందిన రొంపల్లి సంతోష్ కుమార్ మరోసారి పేదలకు చేయూతని అందించి మంచి మనసును చాటుకున్నారు. సోమవారం ఇంటర్నేషనల్ వైశ్యపరేషన్ ఆధ్వర్యంలో తాండూరులోని పేద ఆర్యవైశ్యులకు నిత్యవసర సరుకులతో పాటు కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ మాట్లాడుతూ దసరా సందర్భంగా తన తండ్రి స్వర్గీయ రొంపల్లి కిష్టయ్య స్మారకార్థం పేదలకు నిత్యవసర సరుకులతో పాటు కొత్త బట్టలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. పేదలలో సంతోషం నింపడం ఆత్మసంతృప్తి ఇచ్చిందని అన్నారు. త్వరలోనే తండ్రి స్వర్గీయ రంపల్లి కిష్టయ్య పేరుతో ఆర్కే ఫౌండేషన్ ను స్థాపించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21229/