schedule Monday, July 06, 2026

బీఆర్ఎస్‌కు మళ్లీ షాక్..!

calendar_today October 25, 2023
person dharshininews
బీఆర్ఎస్‌కు మళ్లీ షాక్..!
బీఆర్ఎస్‌కు మళ్లీ షాక్..! - మొన్న మండల నేతలు - నేడు పట్టణ నేతలు, కౌన్సిలర్ల చేరిక - ఆహ్వానించిన కాంగ్రెస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మొన్నటి వరకు నియోజకవర్గంలోని మండల నేతలు హస్తం గూటికి చేరితే.. నేడు పట్టణానికి చెందిన నేతలు, కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తాండూరులోని కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం తాండూరు పట్టణానికి చెందిన నేతలు, బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, నాయకులు సాయిపుర్ బాల్ రెడ్డి, మసూద్, బోయరాజు, కౌన్సిలర్లు పట్లోల్ల నీరజ బాల్ రెడ్డి, బోయరవి, అబ్దుల్ రజాక్, కో ఆఫ్షన్ సభ్యుల అబ్దుల్ ఖవి, యువజన నాయకులు తాండ్ర రాకేష్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బీఆర్ఎస్ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ గెలుపుకు అందరు కృసి చేయాలన్నారు. ఈ కార్యకరమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.   ఇది కూడా చదవండి... https://dharshininews.com/21262/