schedule Monday, July 06, 2026

పైలెట్ పాదయాత్ర షురూ..!

calendar_today October 27, 2023
person dharshininews
పైలెట్ పాదయాత్ర షురూ..!
పైలెట్ పాదయాత్ర షురూ..! - పాత తాండూరు నుంచి ప్రారంభం - పూజలు, ప్రార్థనల తరువాత పర్యటన - రోహిత్ రెడ్డికి జేజేలు పలికిన ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం అట్టహాసంగా షురూ అయ్యింది. మొదటి రోజు పాత తాండూరు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పట్టణంలో పాదయాత్రను పురస్కరించుకుని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా నిజాం షాహీ దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నేతలతోకలిసి వార్డులో పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్రలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వార్డుల్లో ప్రజలను అప్యాయంగా పలకరించారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరుతూ ముందుకు సాగారు. పాదయాత్రలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని జనం సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నేతలు, కార్యకర్తలు, జనాలు జేజేలు పలికారు. ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు, పార్టీ సీనీయర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21337/