schedule Monday, July 06, 2026

మరో రూ.3 లక్షలు దొరికాయి..!

calendar_today November 2, 2023
person dharshininews
మరో రూ.3 లక్షలు దొరికాయి..!
మరో రూ.3 లక్షలు దొరికాయి..! - తరలిస్తున్న వ్యక్తి నుంచి సీజ్ - వివరాలు వెల్లడించిన సీఐ రాజేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా పోలీసులు నగదును సీజ్ చేస్తున్నారు. తాజాగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పట్టుకున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా పట్టణంలోని వినాయక చౌరస్తా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.3 లక్షలను గుర్తించారు. ఈ మేరకు నగదును స్వాదీనం చేసుకుని స్క్రీనింగ్ కమిటికి అందజేయడం జరుగుతుందని సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21483/