schedule Monday, July 06, 2026

స్వర్ణకారులకు అండగా ఉంటా..!

calendar_today November 5, 2023
person dharshininews
స్వర్ణకారులకు అండగా ఉంటా..!
స్వర్ణకారులకు అండగా ఉంటా..! - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - ఎమ్మెల్యేకు మద్దతు ఇచ్చిన స్వర్ణకారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని స్వర్ణకారులకు అండగా ఉంటానని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని గాంధీచౌక్ లోని స్వర్ణకారులు వీదులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి స్వర్ణకారులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరులో ఎన్నడూ లేని విధంగా రూ.1600 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అదేవిధంగా స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణకారులకు అండగా ఉంటానని అన్నారు. తనకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్ పర్సన్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, సంఘం నాయకులు వినోద్ చారీ, శ్రీనివాస్ చారి, బాలకృష్ణ, పరమేష్ చారి, సురేందర్ చారి, డాక్టర్ జయప్రసాద్, చెంగోల్ శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21554/