schedule Monday, July 06, 2026

రోహిత్ రెడ్డితోనే తాండూరు అభివృద్ధి

calendar_today November 7, 2023
person dharshininews
రోహిత్ రెడ్డితోనే తాండూరు అభివృద్ధి
రోహిత్ రెడ్డితోనే తాండూరు అభివృద్ధి - ఎమ్మెల్యే తల్లి, జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి - తాండూరు మండలంలో ఎన్నికల ప్రచారం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో మళ్లీ కేసీఆరే అధికారంలో రావాలని, ఇందుకు ప్రజలందరు సహకరించాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని గౌతాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి హాజరై కుమారుడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున ప్రచారం చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. హోటళ్లలో చాయ్ పోస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం అందరికి అందాలంటే మళ్లీ కేసీఆరే అధికారంలోకి రావాలన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరులో గతంలో ఎవ్వరు చేయని విధంగా అభివృద్ధి చేశారని అన్నారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో సాధ్యమవుతుందన్నారు. కావున ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, మహిళ కన్వీనర్ శకుంతల, నాయకులు రాజుగౌడ్, గ్రామ అధ్యక్షులు దస్తయ్య, మైనార్టీ నాయకులు రషీద్ పాష తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21635/