schedule Saturday, September 19, 2026

కాంగ్రెస్‌వి అడ్రస్ లేని పథకాలు

calendar_today November 7, 2023
person dharshininews
కాంగ్రెస్‌వి అడ్రస్ లేని పథకాలు
కాంగ్రెస్‌వి అడ్రస్ లేని పథకాలు - ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదు - ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీవి ఆడ్రస్ లేని పథకాలు అని, వారెంటీలేని పథకాలను నమ్మొద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణీ ఆర్తి రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి పాల్గొన్నారు. మహిళ నేతలతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకోసం సహకరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేని ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందన్నారు. వ్యారెంటీ లేని గ్యారెంటీ పథకాలను నమ్మొద్దని, కాంగ్రెస్ మోసానికి బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మహిళ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, ఉర్దూ ఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం. అక్రమ్, యువనాయకులు రమేష్ టైలర్. మహిళ నాయకులు అనిత, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21639/