schedule Friday, September 18, 2026

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గెలిపించాలి

calendar_today November 8, 2023
person dharshininews
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గెలిపించాలి
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గెలిపించాలి - తల్లి, జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి - లక్ష్మీనారాణపూర్ లో ఎన్నికల ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలం లక్ష్మినారాయణ పూర్ గ్రామంలో జెడ్పీటీసీ ప్రమొదిని రెడ్డి బీఆర్ఎస్ తరుపున ఎన్నికల ప్రచారం నిరవహించారు. ఇంటి ఇంటికి తిరిగి బీఅర్ఎస్ మెనిఫెస్టో వివరించారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడ్డారని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ శకుంతల, మాజీ ఏఎంసి డైరెక్టర్ అషన్న స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21668/