schedule Thursday, September 17, 2026

ఫస్ట్ నామినేషన్ వేసిన పైలెట్

calendar_today November 8, 2023
person dharshininews
ఫస్ట్ నామినేషన్ వేసిన పైలెట్
ఫస్ట్ నామినేషన్ వేసిన పైలెట్ - ఆర్వో కార్యాలయంలో దాఖలు - బీఆర్ఎస్ తరుపున వేసిన రోహిత్ రెడ్డి  తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలెట్ రోహిత్ రెడ్డి ఫస్ట్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మొదటి సెట్ సమర్పించారు. తల్లి జేడ్పిటిసి ప్రమోదిని రెడ్డి, సతీమణి ఆర్తి రెడ్డితో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ అందజేశారు. ఈనెల 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బుధవారం మొదటి సెటును దాఖలు చేశారు. రేపు గురువారం మరో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, బీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్, బిసి సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.