schedule Monday, July 06, 2026

రోహిత్ రెడ్డి సరైనోడు..!

calendar_today November 8, 2023
person dharshininews
రోహిత్ రెడ్డి సరైనోడు..!
రోహిత్ రెడ్డి సరైనోడు..! - ఎన్నికల్లో ఎమ్మెల్యేకు భారీ మెజార్టీ - రోహిత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సరైనోడు అని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. యాలాల, బషీరాబాద్, తాండూరు మండలంకు చెందిన పలువురు నేతలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షులు తిరుపతయ్య, కమిటి సభ్యులు మోహన్ రెడ్డి, సంగెంకలాన్ కాంగ్రెస్ నాయకులు వడ్డె బస్వరాజ్ తదితరులు మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సరైనోడు అని అభివర్ణించారు. ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ చేరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21676/