schedule Monday, July 06, 2026

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్..!

calendar_today November 9, 2023
person dharshininews
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్..!
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్..! - కారులోకి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు - బోయ అశోక్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల సమక్షంలో యూత్ కాంగ్రెస్ నుంచి బోయ అశోక్ తన అనుచరులతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎండమావి లాంటిదన్నారు. ఆరు గ్యారెంటీలు తెచ్చిన హస్తంను ఎవ్వరు నమ్మడం లేదన్నారు. అదేవిధంగా పార్టీలో చేరిన బోయ అశోక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తాండూరులో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళ కన్వినర్ శకుంతల, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21757/