schedule Monday, July 06, 2026

మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటాం

calendar_today November 10, 2023
person dharshininews
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటాం
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటాం - మృతుని కుటుంబాన్ని పరామర్శించిన నేతలు - ఆర్థిక సాయంతో పాటు భరోసా అందించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు అన్నారు. తాండూరు మున్సిపల్ కు చెందిన ముణ్యప్ప అనే కార్మికుడు హఠాన్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు నరేందర్ గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షులు గోపాల్ కుటుంబాన్ని పరామర్శించారు. అతని అంత్యక్రియల నిమిత్తం రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మరణించిన ముణ్యప్ప కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసా అందించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు నరేష్, బలరాం తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21773/