schedule Thursday, September 17, 2026

సూపర్ మిత్రునాయక్..!

calendar_today November 11, 2023
person dharshininews
సూపర్ మిత్రునాయక్..!
సూపర్ మిత్రునాయక్..! - తాండూరు ఎమ్మెల్యే కోసం మొక్కు - ఎన్నికల్లో గెలిచే వరకు అవి వేసుకోన్న సర్పంచ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని తాండూరులో రాజకీయాలు వేడెక్కిన తరుణంలో కూడా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై నేతల్లో, ప్రజల్లో క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవవలే ఓ గిరిజన యువకుడు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బొమ్మను పచ్చబొట్టుగా వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గిరిజన తాండాకు చెందిన సర్పంచ్ కూడా అబిమానం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం బషీర్ మియా తాండా సర్పంచ్‌గా మిత్రునాయక్ కొనసాగుతున్నారు. శనివారం రసూల్‌ పూర్ హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోసం మొక్కు తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి గెలిచే వరకు ఒంటిపై చొక్కా, కాళ్లకు చెప్పులు వేసుకోనని మొక్కు తీసుకున్నారు. గిరిజన సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలు శభాష్‌ అంటూ అభినందిస్తున్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21830/