schedule Monday, July 06, 2026

బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు

calendar_today November 13, 2023
person dharshininews
బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు
బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు - తాండూరు మండలం నుంచి చేరికలు - కండువాలు వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా జరగుతున్నాయి. తాండూరు మండలం నుంచి పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మండలంలోని గుంతబాస్పల్లి ఉపసర్పంచ్ ఖైరత్ అలీ తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారితో పాటు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్, షబ్బీర్ అహమ్మద్, అమేర్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా సిరిగిరిపేట్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ మెనిఫెస్టోను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. మరోవైపు పార్టీలో చేరిన నాయకులు, యువకులు మాట్లాడుతూ తాండూరులో రెండోసారి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీ గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21836/