schedule Thursday, September 17, 2026

తాండూరులో 2 నామినేషన్లు ఔట్..!

calendar_today November 13, 2023
person dharshininews
తాండూరులో 2 నామినేషన్లు ఔట్..!
తాండూరులో 2 నామినేషన్లు ఔట్..! - బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల దరఖాస్తులు రిజక్ట్ - వెల్లడించిన ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు - ముగిసిన నామినేషన్ల పరిశీలన తాండూరు, దర్శినిప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాఖలైన నామినేషన్లలో రెండు నామినేషన్లను తొలగించారు. ఈనెల 3 నుంచి 10వ తేది వరకు తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్లు స్వీకరించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు దాఖలు చేసిన దరఖాస్తులను సోమవారం వరకు పరిశీలిన జరిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంకు సంబంధించి మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని వివరించారు. వారి నుంచి మొత్తం 37 సెట్ల రూపంలో నామినేషన్లు దాఖలు కావడం జరిగిందన్నారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా 28 మంది అభ్యర్థుల దాఖలలో రెండింటిని తిరస్కరించడం జరిగిందన్నారు. ఇందులో బీఆర్ఎస్ నుంచి ప్రమోదిని రెడ్డి దాఖలు చేసిన నామినేషన్లో ఎన్నికల అఫిడవిట్, ఏ. బీ ఫారాలు సమర్పించలేదని, ప్రపోజల్స్ వివరాలను కూడా అందించలేదన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి యు.రమేష్ కుమార్ దాఖలు చేసిన నామినేషన్ లో ఏ, బీ ఫారాలను సమర్పించలేదన్నారు. ముఖ్యంగా పది మంది ప్రపోజల్స్ వివరాలను కూడ సమర్పించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా అయినా గుర్తించేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. ఈ కారణలో ఇద్దరు నామినేషన్లను తిరస్కరించడం జరిగిందన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21850/