schedule Thursday, September 17, 2026

బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జుబేర్ లాల

calendar_today November 14, 2023
person dharshininews
బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జుబేర్ లాల
బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జుబేర్ లాల - నియామకపత్రం అందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల నియామకం అయ్యారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జుబేర్ లాలను నియమించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జుబేర్ లాలకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో భారీ విజయం సాధించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అదేవిధంగా తనకు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వడం పట్ల ఎమ్మెల్యేకు జుబేర్ లాల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మైనార్టీ నాయకులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21885/