schedule Thursday, September 17, 2026

గాజు గ్లాసు గ్యారెంటీ..!

calendar_today November 14, 2023
person dharshininews
గాజు గ్లాసు గ్యారెంటీ..!
గాజు గ్లాసు గ్యారెంటీ..! - ఆ గురు పైనే పక్కా పోటీ - తాండూరు జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తమకు గాజు గ్లాసు గుర్తు గ్యారెంటీగా వస్తుందని, ఆ గుర్తుతోనే పోటీ చేయడం పక్కా అని వికారాబాద్‌ జిల్లా తాండూరు జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. గత కొన్ని రోజులుగా జనసేన అభ్యర్థికి గ్లాసు గుర్తు కేటాయింపుపై సందిగ్దత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జనసేన అభ్యర్థి నేమూరి శంకర్‌ గౌడ్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో జనసేనకు గ్లాసు గుర్తు కేటాయింపులో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఎన్నికల కమిషన్ కి గాజు గ్లాసు గుర్తు క్లారిటీ పై దరఖాస్తు చేసుకున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఏ- ఫామ్, బీ – ఫామ్ లను సమర్పిండచం జరిగిందన్నారు. నామనేషన్ల ఉపసంహరణల అనంతరం గాజు గ్లాసు గుర్తు వస్తుందని నమ్మకముందన్నారు. దీనిపై వచ్చే పుకార్లను నమ్మరాదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుండగా బిజెపి సహకారంతో తాండూరుతో అన్ని చోట్ల గెలుస్తామన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21896/