schedule Monday, July 06, 2026

అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి

calendar_today November 15, 2023
person dharshininews
అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి
అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి - ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరోసారి ఆదరించండి - ప్రచారంలో సతీమణి ఆర్తి రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసే సత్తా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఉందని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి తాండూరు పట్టణం 26వ వార్డులో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఆధ్వర్యంలో గుమాస్తా నగర్ లో నిర్వహించి ప్రచారంలో ఆర్తి రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కరపత్రాలను పంచుతూ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాండూరు ప్రజల కష్టసుఖాలు భాగా తెలుసు అన్నారు. రెండేళ్లలో రూ.1600 కోట్లతో అభివృద్ధి చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ అనురాధ, వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, దేవాలయ చైర్మన్ కుంచెం మురళీధర్, అనిత, కోటం ప్రసాద్, చెన్ బసప్ప, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   ఇదికూడ చదవండి... https://dharshininews.com/21939/