schedule Thursday, September 17, 2026

బీసీల పక్షపాతి పైలెట్..!

calendar_today November 15, 2023
person dharshininews
బీసీల పక్షపాతి పైలెట్..!
బీసీల పక్షపాతి పైలెట్..! - మండలంలో బీసీ సంఘం నేతల ప్రచారం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : బీసీల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డిని బీసీల పక్షపాతిగా అభివర్ణించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం తాండూరు మండలం కరణ్ కోట్, ఓగిపూర్, గౌతాపూర్ గ్రామాల్లో ప్రచారం చేశారు. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, నేతలు బీఆర్ఎస్ కరపత్రాలను పంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలిపించాలని కోరారు. తాండూరులో ఉన్న బీసీలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. బీసీ సంక్షేమ భవన నిర్మాణానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌతాపూర్ సర్పంచ్ రాజప్ప గౌడ్, కరణ్ కోట్ ఉపసర్పంచ్ హేమంత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు బోయ అశోక్, బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మండల అధ్యక్షులు బసంత్ కుమార్, నాయకులు రాము ముదిరాజ్, హరి ప్రసాద్, వెంకట్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://dharshininews.com/21958/