schedule Thursday, September 17, 2026

రొంపల్లి సేన.. గులాబీ సేవ..!

calendar_today November 16, 2023
person dharshininews
రొంపల్లి సేన.. గులాబీ సేవ..!
రొంపల్లి సేన.. గులాబీ సేవ..! - పైలెట్ కోసం ఇంటింటి ప్రచారం - ఓటర్ల నుంచి మంచి ఆదరణ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన బీఆర్ఎస్ యువనాయకులు, వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యూత్ సెక్రటరి రొంపల్లి సంతోష్‌ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ కోసం, పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపుకోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత రెండు రోజులుగా రొంపల్లి సంతోష్ కుమార్ పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతున్నారు. అదేవిధంగా పలువురు వ్యాపారస్తులును కలిసి పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపుకు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సాధించిన ప్రగతి కరపత్రాలను పంచుతూ రోహిత్ రెడ్డికే ఓటేయాలని కోరుతున్నారు. రొంపల్లి సంతోష్ కుమార్ తన అనుచరులతో చేస్తున్న ప్రచారానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్‌ కుమార్ మాట్లాడుతూ తాండూరులో మళ్లీ రోహితన్నే వస్తారని, రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌స్సే.. వస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21977/