schedule Wednesday, July 08, 2026

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీకి సాక్షి

calendar_today November 24, 2023
person dharshininews
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీకి సాక్షి
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీకి సాక్షి - అభినందించిన st వెల్ఫేర్ స్కూల్ హెచ్ఎం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలకు తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలోని తెలంగాణ గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల, కళాశాల విద్యార్థిని వీ. సాక్షి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు పి.పార్వతమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16న అండర్ -17 విభాగంగా కీసర గుట్టలో జరిగిన కబడ్డీ పోటీలో పాల్గొన్న విద్యార్థిని సాక్షి ప్రతిభను సత్తా చాటింది. దీంతో వచ్చేనెల డిసెంబర్ లో హన్మకొండలో జరిగే రాష్ట్రా స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థిని సాక్షిని ప్రధానోపాధ్యాయురాలు పి.పార్వతమ్మతో పాటు పీఈటీ కె. మంజుల, పీడీ అనురాధ, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22191/