schedule Monday, September 14, 2026

తాండూరులో కాంగ్రెస్ విజయం

calendar_today December 3, 2023
person dharshininews
తాండూరులో కాంగ్రెస్ విజయం
తాండూరులో కాంగ్రెస్ విజయం - రోహిత్‌ రెడ్డిపై గెలిచిన మనోహర్ రెడ్డి - సుమారు 6 వేల మెజార్టీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మద్య జరిగిన హోరా హోరీ పోరులో విజయం హస్తం కైవసం అయ్యింది. ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి మనోహర్ రెడ్డి సుమారు 6వేల 284 ఓట్లతో మెజార్టీని సాధించారు. దీంతో తాండూరు నియోజకవర్గం హస్తగతం అయ్యింది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22378/