హస్తం గూటికి చేరిన గులాబీ నేతలు
July 8, 2026
dharshininews
హస్తం గూటికి చేరిన గులాబీ నేతలు
- ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని ఇంద్రనగర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు షేక్ ఖాసీం అలీ, షేక్ పాషాతో పాటు పలువురు స్థానిక నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కొత్త – పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కలిసి కట్టుగా సాగాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కోట్‌పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు నాగరాజు, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులు, సీనియర్ నాయకులు, వార్డు యువకులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/43701/