కల్తీ ఆహారాలకు కళ్లెం..!
July 8, 2026
dharshininews
కల్తీ ఆహారాలకు కళ్లెం..!
- కొత్త శాఖ ఏర్పాటుకు కసరత్తు
- ఆ శాఖల నుంచి అధికారుల నియామకం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కల్తీ ఆహారాలపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కల్తీ బారిన పడి ఎవ్వరు నష్టపోకుండా ఉండడంతో పాటు కల్తీ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు కార్యాచరణ ప్రారంభించింది.
త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆహారకల్తీ, డ్రగ్స్ నివారణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త శాఖకు ఒకే విభాగాధిపతి ఉంటారు. దీని పరిధిలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎఫ్‌ఎస్‌ఎల్, ప్రాసిక్యూషన్ విభాగాలు పనిచేస్తాయి. సీఎస్ సంజయ్‌జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌ల సమీక్షలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం విడివిడిగా కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలను విలీనం చేస్తూ కొత్త శాఖను ఏర్పాటు చేయబోతున్నారు. ఆహార, ఔషధ రంగానికి చెందిన నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపేలా.. ఈ సరికొత్త శాఖ పరిధిలోనే ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, లీగల్ సెల్, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ల్యాబ్స్, పటిష్టమైన ప్రాసిక్యూషన్ విభాగాలను కూడా అంతర్భాగంగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, తయారీ కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడంతో పాటు, నకిలీ మందుల ముఠాల గుట్టు రట్టు చేయడానికి ఈ కమాండో తరహా నిఘా విభాగం పగడ్బందీగా పనిచేయనుంది. అంతర్గత కసరత్తులన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నందున త్వరలోనే ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ సరికొత్త ఆహార, ఔషధ నియంత్రణ ప్రత్యేక శాఖ అధికారికంగా అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కొత్త శాఖ అత్యంత కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు అమలు చేయబోతున్నారు. ఈ శాఖ కల్తీ ఆహారాలతో పాటు నకిలీ ఔషదాలపై దాడులు చేపట్టనుంది. ఎవరైనా కల్తీ ఆహరాలను ప్రజలకు అందిస్తే వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా జైలుకు పంపించే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
https://www.dharshininews.com/43696/