schedule Monday, September 14, 2026

హస్తం గెలుపు ప్రజా విజయం

calendar_today December 3, 2023
person dharshininews
హస్తం గెలుపు ప్రజా విజయం
హస్తం గెలుపు ప్రజా విజయం - ప్రజా వ్యతిరేకతతో బీఆర్ఎస్ పరాజయం - సంక్షేమానికి పట్టం కట్టడం అభినందనీయం - కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గెలుపు ప్రజా విజయంగా భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన బుయ్యని మనోహర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తాండూరులో బీఆర్ఎస్ పార్టీపై, ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఈ విజయంతో కనిపించిందన్నారు. ప్రజలే కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల సంక్షేమానికి పట్టం కట్టడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం హర్షణీయమన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22390/