schedule Monday, September 14, 2026

అందరి సహాకారంతో ఎన్నికలు విజయవంతం

calendar_today December 4, 2023
person dharshininews
అందరి సహాకారంతో ఎన్నికలు విజయవంతం
అందరి సహాకారంతో ఎన్నికలు విజయవంతం - సహకరించిన వారందరికి కృతజ్ఞతలు - తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి సహాకారంతో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా ముగించడం జరిగిందని తాండూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు అసెంబ్లీ ఎన్నికల ప్రశాంతంగా ముగియడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో సహాయ రిటర్నింగ్ అధికారులు. ఏఓలు, సెక్టోరల్ అధికారులు, రూట్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టి, అకౌంటింగ్ బృందాలు, ఏఈ ఓ తదితరులు సంపూర్ణ సహాకారం అందించారని అన్నారు. అందరి సహాకారంలో ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగిందన్నారు. ఎన్నికల విజయవంతానికి సహాకారం అందించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22394/