schedule Thursday, September 17, 2026

గోశాలలో కార్తీక దీపోత్సవం

calendar_today December 7, 2023
person dharshininews
గోశాలలో కార్తీక దీపోత్సవం
గోశాలలో కార్తీక దీపోత్సవం - ఏర్పాట్లు చేసిన గోశాల సేవా సమితి - విజయవంతం చేయాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సీతారాంపేట్ లోని గోశాలలో ఎల్లుండి శనివారం కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు గోశాల సేవా సమితి సభ్యులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న దీపోత్సవాన్ని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. డిసెంబర్ 9వ తేది శనివారం సాయంత్రం 6 గంటల నుంచి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే అని సూచించారు. దీపోత్సవం అనంతరం భక్తులకు గోప్రసాదం ఉంటుందన్నారు. కావున మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపోత్సవంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22453/