schedule Thursday, September 17, 2026

మళ్లీ ప్రజావాణీ..!

calendar_today December 8, 2023
person dharshininews
మళ్లీ ప్రజావాణీ..!
మళ్లీ ప్రజావాణీ..! - యధావిధిగా కొనసాగింపు - ప్రకటించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వికారాబాద్, దర్శినిప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాత్కాళికంగా వాయిదా వేసిన ప్రజావాణీ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటన జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా తాత్కాలికంగా రద్దు చేయబడిన ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ఈనెల 11న సోమవారం నుండి యధా విధిగా నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/22486/