schedule Thursday, September 17, 2026

రండి.. బస్సు ఎక్కండి..!

calendar_today December 8, 2023
person dharshininews
రండి.. బస్సు ఎక్కండి..!
రండి.. బస్సు ఎక్కండి..! - ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోండి - తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సమత రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రండి.. ఉచిత ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సమత రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తాండూరు ఆర్టీసీ డీపో పరిధిలో ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మీ పథకం కింద మహిళలతో పాటు బాలికలు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. మహిళలు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని ఉచిత ప్రయాణం పొందవచ్చన్నారు. పథకం అమల్లో భాగంగా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రభుత్వం మహిళ ప్రయాణికులకు అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22492/