మనోహరన్నకు జేజేలు..!
December 10, 2023
dharshininews
మనోహరన్నకు జేజేలు..!
- అట్టహాసంగా విజయోత్సవ ర్యాలీ
- గజమాలలతో సన్మానించిన నేతలు
- తాండూరు ప్రజల రుణం తీర్చుకుంటా
- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి నేతలు, కార్యకర్తలు జేజేలు పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బుయ్యని మనోహర్ రెడ్డి గెలిచిన తరువాత పట్టణంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ర్యాలీలో ప్రజలకు అభివాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఎమ్మెల్యే విజయోత్సవ ర్యాలీలో తాండూరు పార్టీ నాయకులు మనోహర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.
అక్కడి నుంచి పట్టణంలోని నేహ్రు గంజ్, గాంధీ చౌక్, భద్రేశ్వర చౌక్, రైల్వే స్టేషన్, శాంత్ మహాల్ చౌరస్తా మీదుగా తిరిగి ఇందిరా చౌరస్తా వరకు కొనసాగింది. ర్యాలీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి నేతలు, కార్యకర్తలు జేజేలు పలికారు. మనోహర్ రెడ్డి సైతం తాండూరు ప్రజలకు అభివాదం చేశారు. తాండూరు నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన మనోహర్ రెడ్డిని పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు గజమాలలతో సన్మానించారు.
తాండూరు ప్రజల రుణం తీర్చుకుంటా
ర్యాలీ అనంతరం ఇందిరా చౌరస్తా స్ట్రీట్ కార్నర్ లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. తాండూరులో పార్టీ నేతలు, కార్యకర్తల కృషితో కాంగ్రెస్ గెలుపు సాధించిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన తాండూరు ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మీ మహిళల ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. మిగతా పథకాలను కూడా దశల వారిగా అమలు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకాంరతో తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తామన్నారు. ఎన్నికలు ముగిశాయి.. వర్గాలు, ప్రతిపక్షం లేకుండా పనిచేస్తామన్నారు. తాండూరులో ఎలాంటి అక్రమ కేసులు లేకుండా, భూకబ్జాలు లేకుండా సుపరిపాలన అందించడమే ధ్యేమయన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మహిళ అధికార ప్రతినిధి కల్వ సుజాత, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, మాజీ డీసీపీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, మసూద్, ప్రభాకర్ గౌడ్, అజయ్ ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సస్ రత్నమాల నర్సింలు, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ మదుబాల, మమత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/22646/