schedule Wednesday, July 08, 2026

మార్మోగిన మణికంఠ నామస్మరణ

calendar_today December 25, 2023
person dharshininews
మార్మోగిన మణికంఠ నామస్మరణ
మార్మోగిన మణికంఠ నామస్మరణ - మణికంఠ ఆశ్రమంలో పడిపూజ - హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం మణికంఠ ఆశ్రమంలో అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం ఆలయంలో ప్రతి యేడాది మాదిరిగానే పడిపూజ వైభవంగా జరిగింది. ఆశ్రమానికి చెందిన స్వాములు పడిపూజను కన్నుల పండగలా జరిపించారు. పడిపూజలో అయ్యప్ప స్వాముల కీర్తనలు, గీతాలాపనలతో దేవాలయం మార్మోగింది. పడిపూజకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్యే స్వాములతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వెంట డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మహిపాల్ రెడ్డి, ఆశ్రమం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22725/