రూ. 1లక్ష 50వేల నగదు సీజ్
April 15, 2024
dharshininews
రూ. 1లక్ష 50వేల నగదు సీజ్
- వాహనాల తనిఖీలో పట్టుబడిన సొమ్ము
- వివరాలు వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిబంధనలకు విరుద్దంగా తరలిస్తున్న నగదును తాండూరు పట్టణ పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలో జరిగింది. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన మద్దూరి అరవింద్ కుమార్ అనే యువకుడు తన వాహనంలో రూ. 1లక్ష 50వేల నగదును తరలిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో తాండూరు పట్టణ పోలీస్టేషన్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అరవింద్ వద్ద నగదును గుర్తించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా తరలిస్తుండడంతో వాటిని సీజ్ చేసి జిల్లా కలెక్టర్ ట్రేజరీ కార్యాలయానికి పంపించినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా సరే రూ. 50వేలకు మించి తరలించరాదన్నారు. నిబంధనలకు విరుద్దంగా తరలిస్తే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/25582/