schedule Tuesday, September 15, 2026

పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు

calendar_today April 16, 2024
person dharshininews
పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు
పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు - సెక్టోరల్ అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలి - తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు - సెక్టోరల్ అధికారులకు రెండో రోజు శిక్షణ తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే నెలలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని తాండూరు ఆర్డీఓ, సెగ్మెంట్ సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు సూచించారు. మంగళవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో సెక్టోరల్ అధికారులకు రెండో రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల కోసం నియమించబడిన 26 సెక్టోరల్ అధికారులు తమ పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై దృష్టిసారించాలన్నారు. కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించుకోవాలన్నారు. కేంద్రాల వద్ద ర్యాంపులు, తాగునీరు, విద్యుత్, ఇతర వసతులు ఏర్పాటు చేసుకొ వాలన్నారు. అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారి డైరీ, ఫారం-17సీ, మాక్ పోలింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు తారాసింగ్, కిషన్, వెంకటేష్, మునీరుద్దీన్, ఎన్నికల ఉప తహసీల్దార్ లలిత, శిక్షకులు బస్వరాజ్, మృత్యుంజయ స్వామి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25616/