schedule Wednesday, July 08, 2026

ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి

calendar_today April 18, 2024
person dharshininews
ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి
ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి - ఈనెల 25వరకు ఎంపీ నామినేషన్ల స్వీకరణ - రాజేంద్రనగర్ లో దాఖలుకు అవకాశం - నియోజకవర్గంలో 8 కొత్త పోలింగ్ కేంద్రాలు - తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల నిబంధనలు అందరు పాటించాలని తాండూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు సూచించారు. గురువారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నియమావళిలో భాగంగా పోటీ దారుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యిందన్నారు. రాజేంద్రనగర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చన్నారు. నామినేషన్ల పత్రాల కోసం చేవేళ్ల ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలలో సంప్రదించవచ్చన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు సమర్పించాలన్నారు. ఈనెల 25వ తేది వరకు నామినేషన్ దాఖలుకు గడువు ఉంటుందన్నారు. అదేవిధంగా ఎన్నికల నియమావళిని అందరు పాటించాలన్నారు. సామాన్యులతో పాటు ఎవరైనా రూ. 50వేలకు మించి నగదును తరలిస్తే అందుకు తగ్గ పత్రాలు కలిగి ఉండాలన్నారు. లేదంటే వాటిని సీజ్ చేయడం జరుగుతుందున్నారు. అంతేకాకుండా పోటీ చేసే అభ్యర్థులు యూట్యూబ్ చానల్, టీవీ చానల్ లలో ప్రకటనలు చె యరాదన్నారు. నిర్వహకులు అనుమతులు పొందిన వారి ప్రకటనలు మాత్రమే ప్రసారం చేయాలన్నారు. లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దీంతో పాటు ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే, అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే సీవిజిల్ యాప్ లో ఫిర్యాదు చేయాలన్నారు. 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొత్తగా పొలింగ్ కేంద్రాలు మరోవైపు తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండల పరిధిలోని ఊరేంటి తాండా, సిద్దన్న మడుగు తాండా. జైరాం(ఐ)తాండా, ఖానాపూర్, బండపల్లి, మారేపల్లి తండా, కండనెల్లి తాండాలో కొత్తగా 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు తారాసింగ్, మునీరోద్దీన్, వెంకటేష్, ఎన్నికల డిప్యూటి తహసీల్దార్ లలిత, రాజకీయ పార్టీల నేతలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25633/