schedule Wednesday, July 08, 2026

వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకోం

calendar_today April 18, 2024
person dharshininews
వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకోం
వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకోం - విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్ యూఐ కృషి - ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్గనైజేషన్ పేరుతో విద్యా సంస్థల నుంచి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని ఎన్ఎస్‌యూ వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు ఆర్గనైజేషన్ల పేరుతో కాలేజీలు, స్కూల్ యజమాన్యాల పై దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తమ దృష్టివచ్చిందన్నారు. ఎవరైనా ఆర్గనైజేషన్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు. విద్యార్థుల సమస్యలపై ఎన్ఎస్‌యూఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో స్టూడెంట్ హెల్ప్ లైన్ డెస్క్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25651/