schedule Tuesday, September 15, 2026

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా యు.రమేష్ కుమార్

calendar_today April 18, 2024
person dharshininews
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా యు.రమేష్ కుమార్
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా యు.రమేష్ కుమార్ - నియమించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి - అధిష్టానానికి, నేతలకు ధన్యవాదలు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తాండూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు యు.రమేష్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి యు.రమేష్ కుమార్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమిందర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా తనను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం పట్ల యు.రమేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రేమిందర్ రెడ్డికి, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ కుమార్, బంగారు శృతిలకు ధన్యవాదాలు తెలిపారు. చేవేళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25656/