schedule Tuesday, July 07, 2026

పసికందు మృతి బాధాకరం..!

calendar_today May 14, 2024
person dharshininews
పసికందు మృతి బాధాకరం..!
పసికందు మృతి బాధాకరం..! - కుక్కల దాడిపై విచారణ జరిపిస్తాం - ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - బాలుడి కుటుంబానికి ఆర్థిక చేయూత తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కుక్క దాడిలో పసికందు ప్రాణం పోవడం ఎంతో బాధాకరమని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ శివారు బసవేశ్వర నగర్ లో ఓ కుక్క దాడిలో సాయినాథ్ అనే 5నెలల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. బాలుడు మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పరిశీలించి.. తల్లిదండ్రులు దత్తు, లావణ్య, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్కదాడిలో బాలుడు మృతి చెందిన సంఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించేలా చూస్తామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకునేవిధంగా పోలీసు అధికారులను కోరారు. ఇదే సంఘటన కాకుండా తాండూరులో జరుగుతున్న కుక్కుల దాడుల నుంచి ప్రజలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు జోషి వికాష్, కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26465/