schedule Tuesday, July 07, 2026

ఉచితానికి ఇబ్బందులు ఎందుకు..!

calendar_today June 13, 2024
person dharshininews
ఉచితానికి ఇబ్బందులు ఎందుకు..!
chai jr ఉచితానికి ఇబ్బందులు ఎందుకు..! - ఆర్హులందరికి జీరో బిల్ అమలు చేయాలి - తాండూరు బీజేపీ నేతల డిమాండ్ - విద్యుత్ శాఖ అధికారులకు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉచిత విద్యుత్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జీరో బిల్ పథకంలో అర్హులను ఇబ్బందులకు గురిచేయడం తగదని తాండూరు బీజేపీ నేతలు అన్నారు. గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు విద్యుత్ అధికారులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 200ల యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఆరు నెలలు అయినా జీరో బిల్ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు వచ్చిన లబ్దిదారులు విద్యుత్ అధికారులను అడిగితే.. మున్సిపల్ అధికారులను అడగాలని, మున్సిపల్ అధికారులను అడిగితే.. విద్యుత్ అధికారులను అడగాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. పేదలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఇప్పటి కైనా అర్హులైన పేదలందరికి ఉచిత విద్యుత్ కింద జీరో బిల్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దోమ కృష్ణ, మంతటి రోజు, అంతారం కిరణ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27127/