schedule Tuesday, July 07, 2026

గోవుల అక్రమ రవాణాకు కళ్లెం వేయండి

calendar_today June 14, 2024
person dharshininews
గోవుల అక్రమ రవాణాకు కళ్లెం వేయండి
chai jr గోవుల అక్రమ రవాణాకు కళ్లెం వేయండి - తరలించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి - ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు బీజేపీ వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : గోవులను, దూడలను తరలించకుండా అక్రమ రవాణాకు కళ్లెం వేయాలని తాండూరు బీజేపీ నేతలు డిమాండు చేశారు. శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల్లో జరగబోయే బక్రీద్ పండగ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎక్కడ కూడా గోవులను, లేగ దూడలను తరలించకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా ఆవులను, దూడలను వధించకుండా దృష్టిసారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలప్ప, ప్రధాన కార్యదర్శి కిరణ్ ముదిరాజ్, నాయకులు కోట్ల నరేందర్, చిద్రి ప్రకాష్, దోమ కృష్ణ, సంగమేశ్వర్, చందు, శివకుమార్, శివశర్మప్ప తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27147/