schedule Tuesday, July 07, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి

calendar_today June 17, 2024
person dharshininews
ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి
chai jrప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి - నేషనల్ హ్యూమన్‌ రైట్స్ జిల్లా అధ్యక్షులు ఉరడి జయమ్మ - రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్ చేతుల మీదుగా నియామకం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని నేషనల్‌ హ్యూమన్ రైట్స్ వికారాబాద్‌ జిల్లా నూతన అధ్యక్షురాలు ఉరడి జయమ్మ అన్నారు. నేషనల్‌ హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైలపాక రాంచందర్‌ చేతుల మీదుగా ఆల్‌ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు డా.ఇస్లాముద్దీన్ సమక్షంలో సోమవారం ఆమె జిల్లా అధ్యక్షురాలుగా నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు సత్వర న్యాయం అందించేలా నేషనల్‌ హ్యూమన్ రైట్స్ తరుపున పోరాటం చేస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైలపాక రాంచందర్, రాష్ట్ర ఇంచార్జ్ చిట్టుపాక ప్రభాకర్, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డా. ఇస్లాముద్దీన్‌, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు బి నాగరాజులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27235/