schedule Tuesday, July 07, 2026

మల్లికార్జున అప్పాజీకి.. జై..!

calendar_today June 18, 2024
person dharshininews
మల్లికార్జున అప్పాజీకి.. జై..!
chai jr మల్లికార్జున అప్పాజీకి.. జై..! - వైభవంగా స్వామి జన్మదినోత్సవం - ఆసుపత్రిలో అల్పహారం, పండ్ల పంపిణీ - దేవాలయాల్లో భక్తులు, పేదలకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీ గురు మల్లికార్జున అప్పాజీకీ జై అంటూ.. భక్తులు జయ ద్వానాలతో మార్మోగించారు. కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ ప్రాంతానికి చెందిన శ్రీ గురు మల్లికార్జున స్వామీ అస్పాజీ జన్మదినోత్సవ వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం అప్పాజీ చారిట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్వామి జనద్మినాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అప్పాజీ జన్మదినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు అల్పహారం పంపిణీ చేశారు. అదేవిధంగా చిన్నారి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో భక్తులకు అన్నదానం చేశారు. దీంతో పాటు కాళికాదేవి ఆలయం వద్ద భక్తులకు, పేదలకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి' అప్పాజీ మహిమలను కొనియాడారు. అందరు సన్మార్గంలో నడవాలని సందేశం ఇస్తున్న అప్పాజీ స్వామి ఎంతో మహిమాన్వితుడని అన్నారు. ఆయన జ్ఞాపకార్థం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో అశ్రమం నిర్మిస్తున్నామని తెలిపారు. మల్లికార్జున స్వామి భక్తి మార్గంలో అందరు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ దర్మీది రవిశంకర్, చంద్రకళ, పూజారి పాండు, పటేల్ కిరణ్ కుమార్, ఎంపీటీసీ శాంతుకుమార్, అంజిల్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27272/