schedule Tuesday, July 07, 2026

కళ్యాణలక్ష్మీలో గందరగోళం

calendar_today June 20, 2024
person dharshininews
కళ్యాణలక్ష్మీలో గందరగోళం
chai jrకళ్యాణలక్ష్మీలో గందరగోళం - గడువు తీరిన రోజే చెక్కుల పంపిణీ - గగ్గోలు పెడుతున్న లబ్దిదారులు - ఇందుకు అధికారులు ఏం చెప్పారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : కళ్యాణ లక్ష్మీ, షాదీమూభారక్ చెక్కుల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. చెక్కు మంజూరైన రోజు నుంచి పంపిణీ చేయకుండా గడువు ముగిసిన రోజే లబ్దిదారులకు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాలాల మండలానికి సంబంధించి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ ఏర్పాటు చేశారు. దాదాపు 80 మంది లబ్దిదారులకు రూ.80లక్షల 9 వేల 280ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతులు మీదుగా అందజేశారు. గత మార్చిలో కొందరు లబ్దిదారులకు ఈ చెక్కులు మంజూరయ్యాయి. మార్చి 21న మంజూరు కాగ ఆ తేది నుంచి మూడు నెలల్లోపు నగదును డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. గురువారం పంపిణీ చేసిన చెక్కులలో అదే రోజు గడువు ఉంది. గడువు తీరిన రోజే లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయడం పట్ల లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు. చెక్కులతో బ్యాంకులకు వెళితే చెల్లవని చెప్పడంతో గందరదోళ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో లబ్దిదారులు గగ్గోలు పెట్టడంతో ఆర్డీఓ అధికారులు చెక్కులు తిరిగి ఇచ్చేయండి.. కొత్త చెక్కులు ఇస్తామని చెప్పినట్లు లబ్దిదారులు వాపోతున్నారు. చెక్కుల పంపిణీలో ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించకుంటే ఈ పరిస్థితి రాకుండే ఉండేది కదా విమర్శించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27304/