ఉద్యమ కారులను ఆదుకోవాలి
June 21, 2024
dharshininews
ఉద్యమ కారులను ఆదుకోవాలి
- లేదంటే మరో ఉద్యమం తప్పదు
- జయశంకర్ సార్ ఆశయాలను నెరవేర్చాలి
- నివాళులు అర్పించిన ఉద్యమ కారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమ కారులను ఆదుకోకుంటే మరో ఉద్యమం తప్పదని తాండూరు ఉద్యమ కారులు అన్నారు. శుక్రవారం తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ వర్దంతి సందర్బంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి టీజేఎస్, విద్యావంతుల వేధిక, లెక్చరర్స్ ఫోరం, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
టీజేఎస్ ఇంచార్జ్, మున్సిపల్ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్, టీజేఏసీ సలహాదారు, విద్యావేత్త రంగారావు, సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, టీవీవీ నాయకులు పర్యాద రామకృష్ణ, లెక్చరర్స్ ఫోరం నాయకులు వీరేశం, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు శ్రీనివాస్, ఆర్టీసీ జేఏసీ నాయకులు మోదిన్ తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను విస్మరించిందన్నారు. అందకనే అధికారం కోల్పోయిందని అన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యమ కారులను ఆదుకోవాలని కోరారు. లేదంటే మరో ఉద్యమం తప్పదన్నారు.
అదేవిధంగా ఫ్రో.జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా అందరు నడుచుకోవాలన్నారు. వర్దంతిలో కళాకారుడు బలరాం పాట, మల్లేశం దరువు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు గౌరీ శంకర్, జగ్గప్ప, ఆదిత్య, రవీందర్, కొత్తూరు చంద్రయ్య, కమాల్ పూర్ మల్లేశం, టీఎల్‌ఎఫ్ నాయకులు రాజశేఖర్, ఆర్టీసీ జేఏసీ నాయకులు అంజిలయ్య, రిటైర్డ్ టీచర్ గోవింద్ రావు, కందనెల్లి వాజిద్, జిలాని తదితరుల పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/27318/