schedule Tuesday, July 07, 2026

ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వాలి

calendar_today June 21, 2024
person dharshininews
ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వాలి
chai jr ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వాలి - ప్రభుత్వ పథకాలు అమలు చేసి ఆదుకోవాలి - జయశంకర్ సారుకు నివాళులు అర్పించిన ఉద్యమ కారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలని తాండూరు ఉద్యమకారులు కోరారు. శుక్రవారం తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ వర్దంతి సందర్బంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి ఉద్యమ కారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ కారులను ప్రభుత్వం గుర్తించాలన్నారు. సంక్షేమ పథకాల్లో ప్రాథాన్యత ఇవ్వాలన్నారు. డబుల్‌ బెడ్‌రూంలో ఇవ్వాలని, ఇళ్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ. 5లక్షలు ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి రూ. 5లక్షలు అందించాలన్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27333/