schedule Monday, September 14, 2026

కొండంత అభివృద్ధి, సంక్షేమం ఖాయం..!

calendar_today June 25, 2024
person dharshininews
కొండంత అభివృద్ధి, సంక్షేమం ఖాయం..!
chai jr కొండంత అభివృద్ధి, సంక్షేమం ఖాయం..! - రెండో సారి ఎంపీగా విశ్వేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం - శుభాకాంక్షలు తెలిపిన సాహు శ్రీలత లక్ష్మీకాంత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో వచ్చే ఐదేళ్లు అభివృద్ధి, సంక్షేమం సాధించడం ఖాయమని బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర మహిళ కార్యదర్శి, తాండూరు మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు. మంగళవారం కేంద్రంలోని పార్లమెంట్‌లో బీజేపీ తరుపున చేవేళ్ల ఎంపీగా రెండో సారి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవేళ్ల ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై విజన్‌ ఉన్న నాయకుడు అని అన్నారు. విద్యా, వైద్యం, రైతాంగం తదితర అంశాల్లోని సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని అన్నారు. వచ్చే ఐదేళ్లు అభివృద్ధి, సంక్షేమం పొందడం ఖాయమన్నారు. రెండో సారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం పట్లు విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27393/