schedule Tuesday, July 07, 2026

ఆర్ఐను దూషించడం సరికాదు

calendar_today June 25, 2024
person dharshininews
ఆర్ఐను దూషించడం సరికాదు
chai jrఆర్ఐను దూషించడం సరికాదు - ఎమ్మెల్యే వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి - టెస్రా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయేందర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల ఆర్‌ఐపై స్థానిక ఎమ్మెల్యే దూషణలు చేయడం సరికాదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్(టెస్రా) వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయేందర్ అన్నారు. ఆదివారం బాలానగర్‌ తహసీల్దార్ కార్యాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన అనుచరులతో వచ్చి మండల గిర్దావర్ వెంకట్ రెడ్డిని దుర్బాషలాడిన సంఘటనను జిల్లా కమిటి తరుపున ఖండించారు. ఆర్‌ఐ వెంకట్ రెడ్డిపై పరుష పదజాలంతో దూషించడం సరికాదని అన్నారు. సెలవు రోజుల్లో పని ఎలా చేస్తారని రెవెన్యూ ఉద్యోగులను మాట్లాడడం గర్హనీయమని సంఘం అభిప్రాయపడ్డారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల నాయకత్వంలో రైతుల భూసమస్యల పరిష్కారం కొరకు రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులంతా జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు రాత్రి పగలు పని చేస్తున్నారని తెలిపారు. ఈ పదిరోజుల్లో పెండింగ్ ధరణి దరఖాస్తులకు నివేదికలు పంపాలని సెలవు రోజుల్లో కూడా పని చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లి సిబ్బందిని ఆవేశంతో దూశించడంపై యావత్ రెవెన్యూ ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో ఆర్‌ఐ వెంకట్ రెడ్డిని సస్పెండ్‌ చేయడం జరిగిందన్నారు. సరైన రెవెన్యూ సిబ్బందిలేక క్షేత్ర స్థాయిలో చాలా పని ఒత్తిడితో రెవెన్యూ ఉద్యోగులు సతమతమౌతున్నారని, అవసరమున్న చోట రిటైర్డ్ ఉద్యోగుల సహకారం తీసుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రెవెన్యూ శాఖకు చాలా నష్టం జరిగిందని ఆరోపించారు. అలాంటి రెవిన్యూ శాఖను ఈ ప్రభుత్వం కాపాడుతుందని ఆశాభావంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆర్ఐ విషయంలో ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆర్ఐ వెంకట్ రెడ్డి సస్పెన్షన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27400/