రేపు స్కూళ్ల బంద్..!
June 25, 2024
dharshininews
రేపు స్కూళ్ల బంద్..!
- ప్రకటించిన ఏబీవీపీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో స్కూల్ బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ గౌడ్ తెలిపారు. మంగళవారం వారు ఓ ప్రకటనలో మా్లాడుతూ పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న పిలుపునిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి డిమాండ్‌తో బంద్ చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తూ, అక్రమంగా బుక్స్ అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్ కు అందరూ సహకరించాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు స్వచ్ఛందగా బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి వినోద్, శ్రీనివాస్, ఇతర విద్యార్థి నాయకులుతదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/27404/