schedule Tuesday, July 07, 2026

కాల్‌ చేసి సమస్యలు చెప్పండి..!

calendar_today June 26, 2024
person dharshininews
కాల్‌ చేసి సమస్యలు చెప్పండి..!
chai jr కాల్‌ చేసి సమస్యలు చెప్పండి..! - రేపు డయల్ యువర్ డీఎం - తాండూరు డీఎం సమతారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డీపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారిచింది. ప్రయాణికుల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకోవడంతో పాటు పలు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్‌ యువర్ డీఎం కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. తాజాగా రేపు తాండూరు ఆర్టీసీ డీపోలో డయల్ డీఎం కార్యక్రమం చేపడుతున్నట్లు బుధవారం ఆర్టీసీ డీఎం సమతారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రేపు గురువారం సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. డీపో పరిధిలోని వివిధ రూట్లలో ప్రయాణంలో సమస్యలు, వాటి పరిష్కారానికి సూచనలు, సలహాల స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రయాణికులు సెల్‌: 9959226251 కు డయల్ చేసి ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27419/