schedule Sunday, September 13, 2026

ప్రజావాణికి అంతా సిద్ధం..!

calendar_today June 30, 2024
person dharshininews
ప్రజావాణికి అంతా సిద్ధం..!
chai jr ప్రజావాణికి అంతా సిద్ధం..! - నేడు ఆర్డీఓ కార్యాయలంలో ఫిర్యాదుల స్వీకరణ - ఇక నుంచి ప్రతివారం ప్రజావాణి కార్యక్రమం - తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : చాలా కాలం తరువాత తాండూరు ఆర్డీఓ కార్యాలయం ప్రజావాణి కార్యక్రమానికి సిద్ధమైంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయం, మండల కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నేడు సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10-30 గంటల నుంచి మధ్యాహ్నం 1-30 గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రజలు తమ ఫిర్యాదులను చేయవచ్చన్నారు. అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమానికి ఆర్అండ్ ్బ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఆర్టీసీ, అటవీ శాఖ తదితర శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27490/